నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో తాటి ముంజలకు డిమాండ్ ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాల నుండి చిరు వ్యాపారులు తాటి ముంజలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. డజను ధర రూ.100 నుండి రూ.120 వరకు పలుకుతోంది. ప్రస్తుతం ఎండలు కూడా ఎక్కువగా ఉండటంతో తాటి ముంజల విక్రయాలు పెరిగాయని చిరు వ్యాపారులు తెలిపారు. తాటి ముంజలలో పోషకాలు ఉన్నాయని, ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.