భారత్ జోడో యాత్రతో బీజేపీలో వణుకు

– రాహుల్ గాంధీకి మద్దతుగా హుస్నాబాద్ లో ర్యాలీ 
– మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్ 
దేశ సమైక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర తో బీజేపీలో వణుకు పుట్టిందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలో రాహుల్ గాంధీ చేపట్టిన జొడో యాత్ర సంవత్సరం పూర్తి కావడంతో మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా  పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని ప్రజాస్వామిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలను కలిగిస్తుందన్నారు. ఈ దేశాన్ని రక్షించుకోవాలని, ఐకమత్యంతో ప్రజలను చైతన్యవంతులను చేయాలని బీజేపీకి వ్యతిరేకంగా నఫ్రత్ చోడో భారత్ జోడో అనే నినాదంతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ  పాదయాత్ర చేపట్టారన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారం వచ్చిన నుండి ఆ పార్టీ వాట్సప్ యూనివర్సిటీ రాహుల్ గాంధీ అసమర్థుడిగా చూపించే ప్రయత్నం చేసిందన్నారు. నరేంద్ర మోడీ ,అమిత్ షా అనే ఇద్దరు ఆదాని, అంబానీ అనే మరో ఇద్దరు గుజరాతీయులకు ఈ దేశాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు.హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక తరహ కాంగ్రెస్ పునర్ వైభవం తెలంగాణలోనూ పునరావృతం కాబోతుందన్నారు. బీజేపీ నుండి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఇండియా కూటమిగా ఏర్పడితే నేడు నరేంద్ర మోడీ ఆ పేరు వినడానికే భయపడుతున్నాడని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, కెడం లింగమూర్తి, బొలిశెట్టి శివయ్య, బంక చందు, వెన్న రాజు, బొంగొని శ్రీనివాస్, కాశ బోయిన రవి, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love