మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న

నవతెలంగాణ – ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి ‘భారతరత్న’ పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్‌ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని మోడీ ‘ఎక్స్‌ ( ట్విటర్‌)’ వేదికగా వెల్లడించారు. దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడారు. తాజా ప్రకటనతో ఈ ఏడాది మొత్తం ఐదుగురిని ఈ పురస్కారం వరించింది. అంతకుముందు బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ, బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌కు ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Spread the love