– జిల్లాలో అట్టహాసంగా తెలంగాణ శతాబ్ది ఉత్సవాలు..
– పారదర్శకంగా రెండు పడకల ఇళ్ల పంపిణీ…
– సింగరేణి క్వార్టర్స్ పంపిణీలో వస్తున్న
– దుష్ప్రచారం పూర్తి అవాస్తవం..
– ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి ప్రగతి పథంలో దూసుకుపోతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భూపాలపల్లి పర్యటనలో భాగంగా భూ పాలపల్లి మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరగా తక్షణమే 30 కోట్ల నిధులను కేటాయించి పనులు ప్రారంభించుకోమని జీవో విడుదల చేయడం జరి గిందని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణరెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి రమణారెడ్డి మాట్లాడుతూ…. భూపాలపల్లి నియోజవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి సహక రిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్, ఆయుష్ కాలేజ్, మెడికల్ కాలేజ్ తరగతుల పనులకు వెన్నుదన్నుగా నిలిచిన రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి పట్టణంలో దీర్ఘకా లికంగా ఉండే సమస్యల పట్ల వీలైనంత త్వరలో పరిష్క రిస్తామని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు. రూ.30 కోట్లతో భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని గుర్తు చేశారు. ఇప్పటికే అంబేద్కర్ సెంటర్లో రూ.4 కోట్ల సిఎస్‌ఆర్ నిధులతో సుందరీకరణ పనులను ప్రారంభించామన్నారు. భూపాలపల్లికి ఔటర్ రింగ్ రోడ్డు కి ఇప్పటికే ప్రభుత్వం స్థానికంగా ఉన్న అధికారులకు ఒక ప్రైవేటు ఏజెన్సీద్వారా సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తద్వారా అనధికారికంగా ఎన్ని కిలోమీటర్లు వస్తుందో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి రోడ్డు నిర్మాణం జరుగు తుందనే సర్వే జరుగుతుందని త్వరలోనే ఆ వివరాలు కూడా వెల్లడిస్తామని తెలిపారు. ఆగస్టు చివరి నాటికి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభించేలా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. జివో 76 ప్రకారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీ యాదవ కాలనీ వాసులకి పట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఇటీవలే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెం టు సభ్యులు,జిల్లా పరిషత్, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ లతో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర శతాబ్ది ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించాలని ఆదేశించగా వారి ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జూన్ 2వ తేదీ నుంచి 21వ వరకు ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తామని తెలిపారు. నాడు తెలంగాణ ఉద్యమ సమ యంలో మన రాష్ట్రం మనకు వస్తే ఎంతో పురోగతి చెందు తుందని అద్భుతమైన ఫలితాలను తీసుకుంటామని అన్న మాట ప్రకారమే తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభి వృద్ధి చెందుతుందని గుర్తు చేశారు. ఇటీవలే సింగరేణికి కేటాయించిన క్వార్టర్స్ పంపిణీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు సింగరేణి సంబంధించిన వ్యతిరేకవర్గం 400 క్వార్ట ర్సు వేరే వారికి అప్పజెప్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని ఇది పూర్తి అవాస్తవమన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లా పం పిన విషయంలో మొదటి దశ ఇళ్ల పంపిణీ విజయ వంతంగా జరిగిన క్రమంలో రెండవ దశ కూడా ఇల్లుల యొక్క సుందరికరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో లబ్ధి దారులను కూడా పారదర్శకంగా ఎంపిక చేసి వారికి త్వరలోనే ఇళ్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు,వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి గండ్ర జ్యోతి మాట్లాడుతూ…భూపాలపల్లి మున్సిపాలిటీకి 30 కోట్ల నిధులు కేటాయించిన గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామా రావుకు జిల్లా పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తూ వారి ఆర్థిక జీవనానికి బాసటగా నిలుస్తున్నా రని తెలిపారు. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్తు మేలో కూడా నిండుకుండలతో చెరువులు, పేద మధ్యత రగతి కుటుంబాలకి కార్పొరేట్ స్థాయిలో విద్య తదితరవి మెరుగు పర్చారన అన్నారు. 100 పైచిలుకగా ఉన్న గురు కులాలు నేడు 1000 పైచిలుకగా మారి సామాన్యుడి కొడుకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అభ్యసించడం చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో , జెడ్పి వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభ రఘుపతిరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, భూపాలపల్లి బి.ఆర్.ఎస్ టౌన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్, స్థ కౌన్సిలర్లు బద్ది సమ్మయ్య, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.