భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి

నవతెలంగాణ -వలిగొండ రూరల్: తెలంగాణలోని సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమమే కేసీఆర్ ఎజెండా  అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన  మండలంలోని జంగారెడ్డి పల్లె, ఎం తుర్క పల్లి మొగిలి పాక, వెల్వర్తి, కెర్చిపల్లి, మొగిలిపాక గోలిగూడెం, సుంకిషాల, మల్లె పల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించదానికి వచ్చిన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టి మంగళ హారతులతో, కోలాట బృందం మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భముగా  ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కులాల వారిగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని, గ్రామాలలో సిసి రోడ్లు, అండర్ డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు ఎన్నో పనులు పూర్తి చేసుకున్నామని, దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిదoగా తెలంగాణలో  ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి దేశంలోనే  రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప్రథమ స్థానంలోకి  తెచ్చిన ఘనత  ఘనత కేసీఆర్ కె దక్కిందని అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా ఆదరించి గెలిపిస్తే మిగిలిన అభివృద్ధి పూర్తి చేసుకుo దామని అన్నారు. స్థానిక శాసన సభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి గురువారం  మొగిలి పాక, కెర్చిపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా  యువకులు, దళితులు ఉద్యొగాలు ఎప్పుడు ఇస్తారని దలిత బందు పార్టీలకు అతీతంగా  అందరికి ఇవ్వాలని యువకులు నిరసన తెలుపడంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, వంగాల వెంకన్న, ఫైళ్ల రాజవర్ధనరెడ్డి, తుమ్మల వెంకట్  రెడ్డి, సురకంటి వెంకట్ రెడ్డి, పనుమటి మమత నరేందర్ రెడ్డి,ముద్దసాని కిరణ్ రెడ్డి, గూడూరు శివశాంత్ రెడ్డి, చిట్టెడి జనార్దన్ రెడ్డి, శివరాత్రి శ్రీను, ఆలకుంట్ల రాజు, శివరాత్రి వేణు, బెల్లి నర్సింహ, లింగయ్య, మర్రి వెంకటేశం, బట్టు సాయి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love