నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం అస్సోనిగూడెం,ఎస్ లింగోటం చౌటుప్పల్ టౌన్ లక్కారం కైతాపురం గ్రామాలలో శనివారం భువనగిరి పార్లమెంటరీ సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థి ఎండి జాంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు వికలాంగుల కుటుంబాలు ఓట్లు వేసి ఎన్నికలలో గెలిపించాలని ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ప్రచారంలో మాట్లాడుతూ.. వికలాంగుల సమస్య పరిష్కారం కావాలంటే ఎండి జాంగీర్ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎందుకంటే ఇప్పటికి పది సంవత్సరాలు దాటినా వికలాంగుని గుర్తించలేక పోయి చిన్నచూపు చూసింది రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు వికలాంగ సమస్యల కోసం ఎన్నో వాగ్దానాలు చేసి ఇప్పటికీ ఈ ఏమి చేయలేకపోయినారు. వికలాంగులకు అంతోదయ రేషన్ కార్డులు 35 కిలోల బియ్యం వెంటనే అమలు చేయాలని ప్రతి వికలాంగుల కుటుంబానికి ఇండ్లు ఇళ్లస్థలాలు కేటాయించి ఇల్లు కట్టియాలని వికలాంగులకు ఉపాధి కోసం వ్యాపారం చేసుకోవడానికి బ్యాంకు ద్వారా ఎలాంటి చర్తులు లేకుండా పది లక్షల రూపాయలు 100% సబ్సిడీతో బ్యాంకు ద్వారా రుణం ఇవ్వాలని వికలాంగులకు ఇరవై ఒక్క రకాల శాతం ఉన్న వాళ్ళకి అన్ని రకాల పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ కావాలంటే పోరాటం చేసి పార్లమెంటులో చట్టసభల్లో అడిగి శక్తి సీపీఐ(ఎం) పార్టీ ఎండి జాంగీర్ గెలిస్తే మన హక్కుల సాధన కోసం పోరాటం చేసి అందరి కోసం సాధిస్తారని కోరుతూ మరొకసారి వికలాంగుల అందరూ ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో జై కేసారం గ్రామ కార్యదర్శి ఎస్.కె అమీర్ ఎస్ లింగోటం గ్రామ నాయకులు వనం శ్రీనివాసులు చౌటుప్పల్ టౌన్ నాయకులు గడ్డం వెంకటేశం లక్కారం గ్రామం నాయకురాలు యాదమ్మ రఘుపతి రెడ్డి కైతపురం గ్రామ నాయకుల శ్రీశైలం సరిత తదితరు పాల్గొన్నారు.