బీఆర్‌ఎస్‌ కు భారీ షాక్..!

నవతెలంగాణ-పెద్దవూర: నల్గొండ జిల్లా తిరుమల గిరి సాగర్ మండలం బీఆర్‌ఎస్‌ కి పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు నియోజకవర్గం లో ఏ ప్రాంతంలో చూసిన పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలనే నియోజకవర్గంలోని పెద్దవూర మండలం పులిచర్ల, ఎర్రగుంట తండా, పోతునూరు,పెద్దవూర మండలానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రేస్ లో చేరారు. వారికి మాజీ మంత్రి జానారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారముగా ఆహ్వానించారు. అలాగే తిరుమల గిరి సాగర్ మండలం వైస్ ఎంపీపి యడవెళ్లి దిలీప్ రెడ్డి, కుడి బుజం, ప్రధాన అనుచరుడు జానారెడ్డి కాలనికి చెందిన దగ్గడ్ బాలు తన 100 మంది అనుచరులతో శనివారం కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Spread the love