- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించినప్పటికీ, ఆ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్‌కు జరిమానా తప్పలేదు. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కారణంగా అక్షర్‌కు రూ. 12 లక్షల ఫైన్ విధిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ జట్టుకు స్లో ఓవర్ రేట్ కారణంగా ఇది తొలి తప్పిదం. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కెప్టెన్ అక్షర్ పటేల్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
- Advertisement -



