- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ గౌరవ సలహాదారులు, జర్నలిస్టు, ఎర్ర జాన్సన్ జన్మదిన వేడుకలు, మలిదశ ఉద్యమకారులు, ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్స్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఆలేర్ పట్టణంలో సోమవారం గెస్ట్ హౌస్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అంగడి ఆంజనేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు దడిగ రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ యేలుగల కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి సిరిగిరి స్వామి, జర్నలిస్టులు గుండు మధు, సీస సాయిరాం, మలిదశ ఉద్యమ నాయకులు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



