Sunday, July 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజ్యాంగాన్ని మార్చే కుట్రలో బీజేపీ సర్కార్

రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో బీజేపీ సర్కార్

- Advertisement -

అలాంటి కుయుక్తులను యువత తిప్పికొట్టాలి :
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ జి.వెన్నెల గద్దర్
రాయపోల్ మండలంలో సర్ ప్రక్రియ పరిశీలన
నవతెలంగాణ- రాయపోల్

రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, అలాంటి కుయుక్తులను యువత చైతన్యంతో తిప్పికొట్టాలని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్‌పర్సన్ గుమ్మడి వెన్నెల గద్దర్ పిలుపునిచ్చారు. అదే విధంగా సర్ ప్రక్రియలో యువత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని భావితరాలకు ఓటు హక్కును అందించే బాధ్యతను నిర్వర్తించాలని ఆమె కోరారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం తిమ్మక్‌పల్లి, రాయపోల్ గ్రామాల్లో సర్ ప్రక్రియను దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతీ పౌరుడికి ఓటు హక్కును భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పిం చారన్నారు. అర్హులైన ఓట్లు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. సర్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా బీఎలఏలు దగ్గరుండి దరఖాస్తు ఫారాలు నింపి బీఎలఓలకు అందించేలా చూడాలన్నారు. గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ నేరుగా అందేటట్టు చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మం జూరు చేయించి గ్రామాలలో అభివద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రజా యుద్ధనౌక గద్దర్ జీవితాంతం పోరాటం చేశారని ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మెన్ గొల్లపల్లి కనకయ్య, వైస్ చైర్మెన్ మద్దెల స్వామి, రాష్ట్ర నాయకులు మద్దుల గాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పల్పనూరి ప్రభాకర్ రెడ్డి, పడాల రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి పంచమి గణేష్, మండల అధ్యక్షులు జాల దుర్గాప్రసాద్, మాజీ మండల అధ్యక్షులు తప్పటి సుధాకర్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -