Sunday, July 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమతోన్మాద రాజకీయాలను అరికట్టాలి

మతోన్మాద రాజకీయాలను అరికట్టాలి

- Advertisement -

రామ మందిర విరాళాలపై
సీబీఐ దర్యాప్తు నిర్వహించాలి
విరాళాల దుర్వినియోగంపై
విహెచ్ మౌన దీక్ష
నవతెలంగాణ – ఇల్లంతకుంట

బీజేపీ మతోన్మాద రాజకీయాలను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు(వీహెచ్‌) అన్నారు. అయోధ్య రామ మందిర విరాళాల దుర్విని యోగాన్ని నిరసిస్తూ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. అయోధ్య రామ మందిర నిర్మాణా నికి ప్రతి ఒక్కరూ భక్తితో విరాళాలు అంద జేస్తే.. కొందరు నాయకులు వాటిని స్వాహా చేస్తు న్నారని ఆరోపించారు. ఆలయం నిర్మాణానికి వచ్చిన విరాళాలే కాకుండా హుండీ డబ్బులు కూడా బీజేపీ నాయకులు పంచుకుం టున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానుక గా అందజేసిన బంగారాన్ని సైతం ప్రత్యేక ఫ్లైట్లో తరలించి కరిగించి పంచు కుంటున్నారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లా డుతూ.. రాముని పేరుతో అక్రమాలు చేస్తే ప్రజలు సహించరని, ఈ దీక్ష ద్వారా కేంద్రా నికి కను నిప్పు కలిగిం చాలన్నదే తమ ఉద్దేశ మని అన్నారు. 2024 జనవరిలో ప్రారం భమైన అయోధ్య రామ మందిరంలో కేవలం రెండున్నర ఏండ్లలోనే ఇటువంటి ఘటనలు జరగడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. దోషులకు కచ్చితంగా శిక్ష పడాలని డిమాండ్ చేశారు. మాన కొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మెన్‌ డాక్టర్ కవ్వంపల్లి సత్య నారాయణ మాట్లాడుతూ.. రాముడి పేరుతో వసూలు చేసిన కోట్లాది రూపాయల విరా ళాలు స్వాహాకావడం, కానుకలను దొంగి లించడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీ సిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మతాలకు విశ్వాసాలకు వ్యతిరేకం కాదని, మతం పేరుతో జరిగే దోపిడీని, మోసాలను సహించ బోదని స్పష్టం చేశారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సింగీతం శ్రీనివాస్, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్లు ఐరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి, పులి కృష్ణ, మాజీ ఎంపీపీలు ఊట్కూరు వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య యాదవ్, మహిళా కాంగ్రెస్ నాయకులు తీగల పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -