Sunday, April 26, 2026
E-PAPER
Homeజాతీయంనిటి ఆయోగ్‌ వైస్‌ చైర్మెన్‌గా బీజేపీ ఎమ్మెల్యే అశోక్‌ లాహిరి

నిటి ఆయోగ్‌ వైస్‌ చైర్మెన్‌గా బీజేపీ ఎమ్మెల్యే అశోక్‌ లాహిరి

- Advertisement -

– ఆయనతో పాటు ఐదుగురు సభ్యుల నియామకం
– పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కోసమేనా?
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

నిటి ఆయోగ్‌ వైస్‌ చైర్మెన్‌గా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే అశోక్‌ లాహిరి నియామకమయ్యారు. ఆయనతో పాటు నిటి ఆయోగ్‌ సభ్యులుగా గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన గోబర్ధన్‌ దాస్‌, క్యాబినెట్‌ మాజీ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ప్రొఫెసర్‌ కెవి రాజు, ప్రొఫెసర్‌ అభరు కరంధేకర్‌, డాక్టర్‌ ఎం. శ్రీనివాస్‌ నియామకం అయ్యారు. నిటి ఆయోగ్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర మంత్రివర్గ సెక్రెటేరియట్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుత నిటి ఆయోగ్‌ వైస్‌ చైర్మెన్‌ సుమన్‌ బెరీ స్థానంలో అశోక్‌ కుమార్‌ లాహిరి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా కూడా పని చేశారు. 15వ ఆర్థిక సంఘ సభ్యుడిగానూ పని చేశారు. ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌, ఆసియా డెవలప్‌ మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ)ల్లో కూడా పని చేశారు. ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, ప్రెసిడెన్సీ j¶నివర్సిటీలో విద్యను అభ్యసించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని బలుఘాట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.అదే విధంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ ఇమ్యునాలజిస్ట్‌, విద్యావేత్త గోబర్ధన్‌ దాస్‌ నిటి ఆయోగ్‌ సభ్యుడిగా నియామకం అయ్యారు. ఈయన 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. గతంలో భోపాల్‌ ఐఐఎస్‌ఈఆర్‌ డైరెక్టర్‌గా, జవహర్‌ లాల్‌ నెహ్రూ j¶నివర్సిటీ ప్రొఫెసర్‌గా పని చేశారు.
రాజీవ్‌ గౌబా క్యాబినెట్‌ మాజీ సెక్రెటరీగా పని చేశారు. ఈయన దీనికి ముందున్న నిటి ఆయోగ్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయనను కేంద్ర ప్రభుత్వం తిరిగి నియమించింది. ప్రొఫెసర్‌ కెవి రాజు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆర్థిక సలహాదారుడిగా, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు కౌన్సిల్‌లో పార్ట్‌ టైం సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ సెక్రెటరీ అభరు కరంధేకర్‌ ఉన్నారు. డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ 2016-22 వరకు హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ హాస్పటల్‌ అండ్‌ మెడికల్‌ కాలేజ్‌ డీన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2022 సెప్టెంబర్‌ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గా ఉన్నారు.

నిటి ఆయోగ్‌ సభ్యులకు ప్రధాని, నిటి ఆయోగ్‌ చైర్మెన్‌ మోడీ శుభాకాంక్షలు తెలిపారు. నిటి ఆయోగ్‌కు మరింత పదును పెట్టాలని సూచించారు. ఫలవంతం, ప్రభావంతంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విధాన రూపకల్పనలో నిటి ఆయోగ్‌ కీలకమైన స్తంభంగా మారిందని తెలిపారు. ఇది సహకారం, సమాఖ్యవాదాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ముందుకు నడుపుతుందని, ఆర్థిక వ్యవస్థకు ఓ చుక్కానిగా మార్చిందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో వినూత్న, దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆలోచనలకు నిటి ఆయోగ్‌ ఓ సమగ్ర, సమర్థ వేదిక అని పేర్కొన్నారు.

ప్రణాళిక సంఘం మార్పు పాలనలో కీలక మార్పు: అశోక్‌ కుమార్‌ లాహిరి
నిటి ఆయోగ్‌ వైస్‌ చైర్మెన్‌ అశోక్‌ కుమార్‌ లాహిరి, సభ్యుడు గోబర్ధన్‌ దాస్‌ శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశోక్‌ కుమార్‌ లాహరి మాట్లాడుతూ ”నిటి ఆయోగ్‌ వైస్‌ చైర్మెన్‌గా ప్రధాని మోడీతో నా మొదటి సమావేశం జరిగింది. ఆయనకు నా ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచినందుకు ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి నా కృతజ్ఞతలు” అని అన్నారు. ప్రణాళికా సంఘాన్ని మార్చాలన్న ప్రధాని నిర్ణయం పాలనలో ఒక కీలక మార్పు అని తెలిపారు. ”ప్రధాని మోడీ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి, దాని స్థానంలో నిటి ఆయోగ్‌ను ఏర్పాటు చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నిటి ఆయోగ్‌ చేసే పని ఏమిటంటే, అది విధానాలను రూపొందిస్తుంది. వాటి అమలును పర్యవేక్షిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుంది” అని ఆయన అన్నారు. సంస్థ పనితీరు ”నిటి ఆయోగ్‌ నీతి, నిష్ఠ, నియత్‌ అనే వ¶డు ఎన్‌లపై ఆధారపడి ఉంది. ఈ వ¶డు ఎన్‌లు ఉంటే మనం విజయం సాధిస్తాం. ‘డేటా ఆధారిత ప్రణాళిక’పై గట్టిగా దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కోసమే
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ నియామకాలను పశ్చిమబెంగాల్‌ ఎన్నికల కోసమే అని చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌ రెండో విడత పోలింగ్‌ ఈ నెల 29న జరగనుంది. ఈ నేపథ్యంలో నిటి ఆయోగ్‌ వైస్‌ చైర్మెన్‌, సభ్యుల నియామకాల్లో పశ్చిమ బెంగాల్‌ కు పెద్ద పీట వేశారు. తద్వారా ఓట్లను రాబట్టుకోవచ్చని బీజేపీ యోచిస్తోంది. నిటి ఆయోగ్‌లో కీలకమైన వైస్‌ చైర్మెన్‌ తోపాటు, ఒక సభ్యుడిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిని నియమించింది. వైస్‌ చైర్మెన్‌ అశోక్‌ కుమార్‌ లాహిరి, సభ్యుడు గోబర్ధన్‌ దాస్‌ పశ్చిమ బెంగాల్‌ కు చెందినవారే. లాహిరి ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేగా ఉండగా, దాస్‌ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -