– తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక
నవతెలంగాణ-బంజారాహిల్స్
బీజేపీ మతోన్మాద ఫాసిస్టు నియంతత్వ విధానాలు, బడా సంపన్న అనుకూల విధానాలు, పేదల ప్రజల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక సభ్యులు తెలిపారు. అదేవిధంగా కేసీ ఆర్ ప్రభుత్వ అడ్డు అదుపు లేని అవినీతి, ఆర్థిక దోపిడీ నియ ంతత్వ, రాచరిక పాలనకు వ్యతిరేకంగా వామ పక్ష పార్టీలు, లౌకిక ప్రజాస్వామిక సంస్థలు కలిసి ఐక్యంగా ఉమ్మడి కార్య చరణ కొరకు గత రెండు నెలలుగా అనేక దఫాలు సమావే శాలు నిర్వహించినట్లు, ఉమ్మడి విధానపత్రం, ఉమ్మడి కార్య చరణను రూపొందించుకున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం),సీపీిఐ(ఎంఎల్) ప్రజాపంథా, సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ, ఎంసీపీిఐ (యు) న్యూ డెమోక్రసీ, ఆర్‌ఎస్‌పీ, బీఎల్ ఎఫ్,భారత జాతీయ ఉద్యమ సంఘం,తదితర అనేక లౌకిక ప్రజాసంఘాలు కలిసి విధాన పత్రాన్ని, తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉమ్మడి కార్యచరణను విస్తతంగా చర్చించి రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సోమజిగుడా ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో రాష్ట్ర సమన్వయకర్తగా నైనాల గోవర్ధన్లను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సభకు వినాయ క్‌రెడ(రిటైర్డ్ ప్రొఫెసర్ ) అధ్యక్షత వహించారు. జస్టిస్ చంద్ర కు మార్ మాట్లా డుతూ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆదాని అంబానీ లాంటి కొద్దిమంది పెట్టుబడి దారులకు దోచిపెడుతున్న తీరును వివరించారు. కేసీఆర్ పభుత్వం తెలంగాణలో ఒక ఆధునిక రాచరిక వ్యవస్థను నెలకొలిపి ప్రజల హక్కులను ఉక్కు పాదంతో అణిచివేసిందని ఈ సందర్భంగా తెలిపారు. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వాడి చలపతిరావు మా ట్లాడుతూ మత విభజన విద్వేషాలను దేశంలో రెచ్చగొ డుతూ ప్రజల వాస్తవ జీవిత సమస్యల నుంచి పక్కదారి పట్టిస్తూ, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదా రుల కు దారాధత్తం చేస్తుందన్నారు. కే గోవర్ధన్, బాల మల్లేష్, హన్మేష్, జానకి రాములు, తుకారాం గుర్రం విజరు కు మార్, కష్ణ ప్రసాద్ తదితర నాయకులు పాల్గొని మాట్లా డారు.తెలంగాణ లోక్‌సత్త్తా అధ్యక్షులు మన్నారం నాగరాజు, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, పిఓడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు అనురాధ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మండల వెంకన్న, సోగరా బేగం, అబ్దుల్ హుక్ కమీర్, ఇస్లాముద్దీన్, కామేశ్వరరావులు తదితర పాల్గొన్నారు.