మార్పు కోసం వస్తున్న..ఆశీర్వదించండి

నవతెలంగాణ – తిరుమలగిరి 
మార్పు కోసం వస్తున్న ఆశీర్వదించండి అని ప్రజావాణి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు భువనగిరి లోక్ సభ ఎంపీ అభ్యర్థి లింగిడి  వెంకటేశ్వర్లు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేస్తున్న ప్రచార యాత్రలో భాగంగా తిరుమలగిరి మండల కేంద్రానికి చేరుకుని చౌరస్తాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గ ప్రాంత వాసిని, ఎక్కువ విద్యార్థులు కలిగి ఉండి అన్ని విధాలుగా రాజకీయ అనుభవం ఉండి ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న  తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాజకీయాల్లోని అవినీతిని పీకి పారేయడానికి నిత్యం చట్టబద్ధ పోరాటం చేస్తు చట్టసభల్లోకి వెళ్లడానికి 12వసారి నీతివంతంగా పోరాటం చేస్తున్న తనను వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో 20వ నెంబర్ అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని  కోరారు.

Spread the love