కాంగ్రెస్‌లో కొనసాగుతున్న చేరికలు..

నవతెలంగాణ – పెద్దవూర

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్, పార్టీ నాయకులు భారీ షాక్ లు ఇస్తున్నారు. పెదవూర మండలం చింతపల్లి, ఉట్లపల్లి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ కి చెందిన మండల జెడ్పిటీసి అబ్బీడి కృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గజ్జెల లింగారెడ్డి, బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు వాసుదేవుల సత్యనారాయణ రెడ్డి, తోడిమ వల్లపు రెడ్డి, పెద్దవూర మండలం వైస్ ఎంపీపి గోన వివేక్ రావు ఆ పార్టీలకి రాజీనామా చేసి గుత్త అమిత్ రెడ్డి సమక్షంలో శనివారం హైదరాబాద్ లోని సీఏం రేవంత్ రెడ్డి వారికీ పార్టీ కండువాలు కప్పి సాధారంగా కాంగ్రెస్ పార్టీ లోకి స్వాగతం పలికారు.ఈసందర్బంగా అబ్బీడి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ప్రజలు బుద్ధి చెప్పారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం లో  బీఆర్ఎస్ పార్టీని ఖాళీ కావడం ఖాయమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి అత్యధిక మెజారిటీ తో విజయం సాధించిడం ఖాయమని తెలిపారు.
Spread the love