క్లీన్ అండ్ గ్రీన్ ఇండియాకు బాల బాలికలే భాధ్యత వహించాలి

– శ్రీమతి అదితి గోయల్ ఐఆర్ఎస్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, హైదరాబాద్
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
కొయ్యలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వచ్ పక్వాడ అవగాహన కార్యక్రమానికి అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ శ్రీమతి అదితి గోయల్ ముఖ్యఅతిథి అత్యధిక విచ్చేసి పాల్గొన్నారు.క్లీన్ అండ్ గ్రీన్ ఇండియా కు నేటి బాల బాలికలే బాధ్యతగా తీసుకోవాలని ఆమె పిలుపుని చ్చారు. మన పరిసరాలను మనమే పరిశుద్ధగా పరిశుభ్రతగా ఉంచుకోవాలని అన్నారు . పాఠశాల బాలబాలికలచే క్లీన్ అండ్ గ్రీన్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తంబ మహేంద్ర జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ అధికారి ఇన్కమ్ టాక్స్ అధికారులు ఏ.కిరణ్ కుమార్,ఏ.విజయ్ యాదాద్రి భువనగిరి జిల్లా విద్య అధికారి కే.నారాయణ రెడ్డి, చౌటుప్పల్ మండల విద్యాధికారి .శ్రీధర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.దుర్గయ్య, ఎంపీటీసీ సభ్యురాలు జెల్లా ఈశ్వరమ్మవెంకటేశం, మాజీ సర్పంచులు మాచర్ల కృష్ణ, గడ్డం నరసింహ, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ కైరంకొండ అశోక్, తదితరులు పాల్గోన్నారు.
Spread the love