బ్రేక్స్ ఇండియా ‘రెవియా’ బ్రాండ్లో గేర్ ట్రాన్స్‌మిషన్ ఆయిల్‌ విడుదల 

నవతెలంగాణ హైదరాబాద్ : ప్రముఖ బ్రేకింగ్ సిస్టమ్స్ తయారీదారు, సరఫరాదారుగా పేరుపొందిన బ్రేక్స్ ఇండియా సరికొత్త బ్రాండ్ ‘రెవియా’ క్రింద గేర్, ట్రాన్స్‌మిషన్ ఆయిల్ విడుదల చేసినట్లు బ్రేక్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుజిత్ నాయక్ తెలిపారు. మూడు బిలియన్ల డాలర్ల టీఎస్ఎఫ్ సమూహంలో బ్రేక్స్ ఇండియా భాగమన్నారు. భద్రత, నాణ్యత కోసం ప్రపంచ ఆటోమోటివ్ ల్యాండ్‌స్కేప్‌లో ఇప్పుడు లూబ్రికెంట్స్ స్పేస్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి దాని విస్తారమైన పంపిణీ నెట్‌వర్క్‌ను పెట్టుబడిగా పెడుతోందన్నారు. బ్రేక్స్ ఇండియా ఈ ఏడాది ఏప్రిల్‌లో రెవియా బ్రాండ్ పేరుతో ఇంజిన్ ఆయిల్ ఉత్పత్తి సమూహంతో లూబ్రికెంట్ల రంగంలోకి ప్రవేశించిందని తెలిపారు. బ్రేక్స్ ఇండియాలో నాణ్యత, భద్రతపై దృష్టి పెడుతున్నామని తెలిపారు.
ఇది మా సరికొత్త బ్రాండ్ రెవియాకు కూడా మా బ్రాండ్ వాగ్దానం చేస్తుందన్నారు. ఇది మా కస్టమర్‌లకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందన్నారు. మా బ్రాండ్‌ను పెంచుకోవడంలో భాగంగా ఇప్పుడు గేర్, ట్రాన్స్‌మిషన్ ఆయిల్‌ను పరిచయం చేస్తున్నామని తెలిపారు. ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాల కస్టమర్లకు అందుబాటులో ఉంటుందన్నారు‌. మొదటి దశలో రెండు గ్రేడ్‌లు 80డబ్ల్యు90, 85డబ్ల్యు140 ప్రవేశపెడతున్నామని పేర్కొన్నారు. తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవడానికి, గరిష్ట రక్షణను అందించడానికి రూపొందించబడ్డాయన్నారు. 85డబ్ల్యు140 సరికొత్త ఏపీఐ జీఎల్ 5 స్పెసిఫికేషన్‌లకు అనుగుణంగా రూపొందించబడిందని తెలిపారు.
Spread the love