మెరుగైన స్ట్రీమింగ్‌ అనుభూతి కోసం డాల్బీ విజన్‌ ప్రవేశపెట్టిన ZEE5

  • డివైసుల్లో సినిమాటిక్‌ అనుభూతి అందించే డాల్బీ విజన్‌తో పాటు డాల్బీ అట్మోస్‌

నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశపు అగ్రగామి స్ట్రీమింగ్ వేదిక ZEE5, మెరుగైన స్ట్రీమింగ్‌ సర్వీసు అందించేందుకు తన ప్రేక్షకులకు అసమానమైన ఆడియోవిజువల్‌ అనుభూతి అందిస్తున్నామని ఉత్సాహంగా ప్రకటించింది. నవంబర్‌ 2023 నుంచి ఈ మైమరపింపజేసే సినిమాటిక్‌ అనుభూతి iOS మొబైల్‌ పరికరాలు, యాపిల్‌ టీవీ, ఆండ్రాయిడ్‌ టీవీలో అందుబాటులో ఉంది. వీక్షకులకు మెరుగైన వీక్షణ అనుభూతి అందించడంపై దృష్టి సారించిన ZEE5 ఒక సంవత్సరం క్రితమే డాల్బీ అట్మోస్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ప్రేక్షకులకు సంపూర్ణమైన నిగూఢాత్మక అనుభూతి అందించేందుకు డాల్బీ విజన్‌తో తన సేవలను మరింత విస్తృతపరిచింది. శక్తిమంతమైన డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కలయిక మీకు ఇష్టమైన సినిమాలను మరింత ఆకట్టుకునేలా చేస్తూ మీరు ఇష్టపడే కథలతో మిమ్మల్ని మరింత అనుసంధానం చేసి మిమ్మల్ని మరింత మైమరపింపజేయడంలో సాయపడుతుంది.
కమల్‌ హాసన్‌ నటించిన విక్రమ్‌, తాజా హందీ బ్లాక్‌బస్టర్‌ గదర్‌2, కట్టిపడేసే బయోపిక్‌ తర్లా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించిన హడ్డీ సహ అనేక ఇతర చిత్రాలు ఇపుడు డాల్బీ విజన్‌, డాల్బీ అట్మోస్‌లో స్ట్రీమ్‌ అవుతున్నాయి. ZEE5 సబ్‌స్క్రైబర్లు డాల్బీ విజన్‌, డాల్బీ అట్మోస్‌తో కూడిన ప్రీమియం 4K ప్యాక్‌ ద్వారా తమ డివైసుల్లో నెక్ట్స్‌ లెవల్‌ అనుభూతి సొంతం చేసుకోవచ్చు. మనీష్‌ కాల్రా, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, ZEE5 ఇండియా మాట్లాడుతూ, “వినియోగదారులు ముందు అని భావించే బ్రాండ్‌గా మా వేదిక ద్వారా వీక్షకుల సమగ్ర అనుభూతికి ప్రాధాన్యం ఇవ్వడమన్నది మా అచంచలమైన నిబద్ధత. డాల్బీ అట్మోస్‌ విజయం తర్వాత అన్ని పరికరాల్లో అద్భుతమైన వీక్షణ అనుభూతి అందించేందుకు ఇప్పుడు మేము డాల్బీ విజన్‌ తీసుకొచ్చాం. సాంకేతిక పురోగతితో మెరుగైన ఆఫర్స్‌ పెంచడం ద్వారా ZEE5లో నాణ్యమైన వీక్షణ సమయాన్ని అందించడంపై మేము వ్యూహాత్మక దృష్టి సారించాం. మైమరపింపజేసే అత్యంత నాణ్యతతో కూడిన వినోదం కోసం కొత్త ప్రమాణాలు సృష్టిస్తూ ఆవిష్కరణల మార్గదర్శకత్వాన్ని కొనసాగిస్తాం” అన్నారు.
     కరణ్‌ గ్రోవర్‌, సీనియర్‌ డైరెక్టర్‌ – కమర్షియల్‌ పార్టనర్‌షిప్స్‌ IMEA డాల్బీ లాబోరేటరీస్‌ మాట్లాడుతూ, “ డాల్బీ విజన్‌ & డాల్బీ అట్మోస్‌తో అసమానమైన ఆడియోవిజువల్‌ అనుభూతి అందించేలా ZEE5కు సహకరిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ZEE5లో మంత్రముగ్ధులను చేసే డాల్బీ విజన్‌ రంగులు, సునిశిత దృశ్యాలు, మైమరపింపజేసే డాల్బీ అట్మోస్‌ సౌండ్‌ ద్వారా మీరు ఇష్టపడే సినిమాలతో గతంలో కంటే మీరు మరింత దగ్గరకావచ్చు” అన్నారు.
ZEE5 ఛీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ కిషోర్‌ ఎ.కె మాట్లాడుతూ, “కొత్త కోణాలు అన్వేషిస్తూ, మా ప్రేక్షకులకు మైమరపింపజేసే వీక్షణను పరిచయం చేస్తూ నిరంతరాయ అనుభూతి అందించడానికి ZEE5లో మేము సదా కృషి చేస్తూ ఉంటాం. డాల్బీ విజన్‌కు అట్మోస్‌ చేర్చడం ద్వారా మా వినియోగదారులు వారి కంటెంట్ వినియోగ అనుభూతిలో ఒక సంపూర్ణ మార్పుతో కూడిన ఫీచర్‌ అందించేందుకు మాకు వెసులుబాటు లభించింది. డాల్బీ అట్మోస్ చేరిక ద్వారా ప్రేక్షకులు మైమరపింపజేసే త్రీడైమెన్షల్‌ సౌండ్‌ స్కేప్‌ అనుభూతి పొందుతారు. ఇప్పుడు డాల్బీ విజన్‌ కచ్చితమైన రంగులు, కాంట్రాస్ట్‌తో అద్భుతమైన దృశ్య సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. మా వేదిక ద్వారా స్ట్రీమింగ్‌ అనుభూతిలో మరిన్ని ఉత్తమ ఫీచర్లు ఆవిష్కరిస్తూ, ప్రవేశపెడుతూ అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు ఈ సరికొత్త జోడింపు మాకు ప్రేరణగా నిలుస్తుంది” అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మైమరపింపజేసే ప్రీమియం వినోద అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తూ స్ట్రీమింగ్‌ రంగ పునర్‌నిర్వచనాన్ని ZEE5 కొనసాగిస్తోంది. వివేకవంతులైన తన ప్రేక్షకులకు అసాధారణమైన కంటెంట్‌ అందించాలన్న ZEE నిబద్ధతను డాల్బీ విజన్‌, డాల్బీ అట్మోస్‌ చేరిక మరింత దృఢతరం చేస్తోంది.

Spread the love