
భిక్కనూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న 62 మంది విద్యార్థులకు సాయంకాల సమయంలో అల్పహారాన్ని పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పురం రాజమౌళి శుక్రవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలు ముగిసే వరకు విద్యార్థులకు అల్పాహారాన్ని అందజేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.