సార్వత్రిక సమ్మెకు పెన్షనర్ల మద్దతు


నవతెలంగాణ కంటేశ్వర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, పెన్షనర్ల వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈనెల 16న జరగనున్న సార్వత్రిక సమ్మెలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది సమ్మెలో పాల్గొంటామని ప్రకటించింది. ముఖ్యంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పెన్షనర్లకు ఇన్కమ్ టాక్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని, ధరల పెరుగుదలను అరికట్టాలని, ప్రభుత్వ రంగ సంస్థలన ప్రైవేటీకరణ విధానాలను విడనాడాలని, రైతాంగానికి కనీస మద్దతు ధర కల్పించాలని, వివిధ శాఖలలో పనిచేస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,తదితర డిమాండ్లతో జరగనున్న ఈ సమ్మెను ప్రజలందరూ భాగస్వాములు కావాలని సమ్మెను విజయవంతం చేయాలని గురువారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో జిల్లా అధ్యక్షులు కే.రామ్మోహన్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సమావేశంలో ఇంకా డివిజన్ అధ్యక్షుడు శిర్ప హనుమాన్లు జిల్లా కార్యదర్శి మదన్మోహన్, కోశాధికారి ఈ వి ఎల్ నారాయణ, జిల్లా నాయకులు ప్రసాద్, రాధాకృష్ణ, స్వరూప రాణి, బేబీరాణి, బన్సిలల్, లావు వీరయ్య పురుషోత్తం, పుష్పవల్లి, బట్టి గంగాధర్ , రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love