కేరళ ప్రభుత్వంపై కేంద్రం నిరంకుశ ధోరణి మానుకోవాలి

– సీఐటీయూ ప్రజా సంఘాలు సంఘీభావం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ కంటేశ్వర్: కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సీఐటీయూ జిల్లాక ప్రధాన కార్యదర్శి  నూర్జహాన్  ఆరోపించారు. ఈ మేరకు గురువారం సీఐటీయూ కేంద్ర కమిటీ పిలుపుమేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ వద్దా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది . ఈ సందర్భంగా
ఏ రమేష్ బాబు, నూర్జహాన్ లు  మాట్లాడుతూ.. కేంద్రం వివక్షపూరిత విధానాలు రాష్ట్రాల హక్కులపై దాడులకు వ్యతిరేకంగా సీఐటీయూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఐద్వా ప్రజా సంఘాలు కేరళ ప్రభుత్వానికి  సంఘీభావంగా  కేంద్ర బిజెపి ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం  నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. కేరళ ప్రభుత్వం పై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అణిచివేత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. కేరళలో విపత్తులు, కష్టకాలంలో కూడా సహాయం చేయకుండా కేంద్రం మొండి చేయి చూపిందన్నారు.
ఎల్ డి ఎఫ్ ప్రభుత్వాన్ని అన్ని విధాల ఆటంకాలు కలిగిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. కేరళ ప్రభుత్వం ఆదాయం ఉత్పత్తి లో ముందంజలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన సంక్షోభం ఏర్పడిందన్నారు. 2021- 22 లో కేరళ రుణ పరిమితి తగ్గించిందని అన్నారు. జీఎస్టీ వంటి ఆదాయ వనరును తగ్గించిందని అన్నారు. ప్రతిపక్ష నేతలపై ఈడి, సిబిఐ, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లను ఉపయోగించడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలలో కేంద్రం జోక్యం చేసుకొని  దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ వ్యవహారాలలో గవర్నర్ జోక్యం చేసుకొని మితిమీరి వ్యవహరించడం ,ప్రభుత్వ పని విధానం పై  ప్రభావం పడుతుందని అన్నారు.
విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం విద్విశ్ పూరిత వైఖరి అవలంబించడం సరికాదని ఇది మేధావులు, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వానికి ప్రజలకు ప్రజా సంఘాలు సంఘీభావంగా ఉంటుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఈవీఎల్ నారాయణ, సీఐటీయూ జిల్లా కోశాధికారి పి స్వర్ణ,  డివైఎఫ్ఐ జిల్లా  ప్రధాన కార్యదర్శి పెద్ది సూరి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విగ్నేష్, బోడ అనిల్, జిల్లా కార్యదర్శి సుజాత సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కటారి రాములు, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్, కృష్ణ , భాస్కర్, అబ్దుల్ ముజీబ్, అర్జువాలి, అంజన్న రాజన్న రవి వినోద్ కళావతి పండరి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు దీపిక తదితరులు పాల్గొన్నారు.

Spread the love