‘వరల్డ్ స్కిల్స్’ పోటీలలో కాంస్య పతకం

నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్లలో ఒకటైన వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్,  ఈరోజు వండర్‌లా హైదరాబాద్‌లో రెండు ఉత్సాహపూరితమైన  కొత్త ఆకర్షణలు  -హైపర్‌వర్స్ మరియు జి -ఫాల్ ను ఆవిష్కరించింది. ఇది అత్యాధునిక సాంకేతికతను హృదయాన్ని కదిలించే సాహసంతో మిళితం చేస్తుంది. ఈ రైడ్‌లను సెప్టెంబర్ 27న ప్రముఖ సినీ నటుడు నాగ చైతన్య,  అరుణ్ కె చిట్టిలపిల్లి (మేనేజింగ్ డైరెక్టర్), ధీరన్ చౌదరి (సిఓఓ), మధు సూధన్ గుత్తా (పార్క్ హెడ్, వండర్‌లా హైదరాబాద్)తో కలిసి ప్రారంభించారు. ఈ హై-టెక్, అడ్రినలిన్-పంపింగ్ అనుభవాలు ఊహ యొక్క సరిహద్దులను మరింత విస్తృతం చేస్తాయి. సాటిలేని వినోదాన్ని అందించడానికి మరియు సందర్శకుల అనుభవాన్ని పెంచడానికి వండర్‌లా యొక్క నిబద్ధతను బలపరుస్తాయి.
జి-ఫాల్, ఒక ఎత్తైన ఫ్రీ-ఫాల్ రైడ్, 40 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వృత్తాకార గుండ్రంగా చుట్టూ కూర్చున్న 12 మంది రైడర్‌లతో, ఇది ఉద్విగ్నమైన రీతిలో , అధిక-థ్రిల్ పంచుతూ పడిపోతున్నట్లుగా వుండి  , ఇది అడ్రినలిన్ ప్రేమికులకు తప్పనిసరిగా పొందాలనే అనుభూతిని అందిస్తుంది.
హైపర్‌వర్స్,  అత్యాధునిక మెటావర్స్ 3డి థియేటర్ అనుభవాన్ని అందిస్తుంది, లీనమయ్యే రీతిలో 5 నిమిషాల వీక్షణ కోసం సెషన్‌కు 30 మందికి పైగా వ్యక్తులకు వీక్షణ  వసతి కల్పిస్తుంది. 8కె  హై-రిజల్యూషన్ డిస్‌ప్లే, 360° సరౌండ్ సౌండ్ మరియు 270° లైట్ మరియు షాడో డిజైన్‌ను కలిగి ఉంటుంది , ఇది అద్భుతమైన 3డి విజువల్స్‌తో ఉత్కంఠభరితమైన రీతిలో  ఎగిరే దృశ్యాలలోకి అతిథులను తీసుకుని వెళ్తుంది. ఈ ఉత్కంఠభరితమైన, పూర్తిగా లీనమయ్యే మెటావర్స్ జర్నీ ఫ్యూచరిస్టిక్ వండర్‌లా హాలిడేస్ ను పునర్నిర్వచిస్తుందని భావన. ఈ నూతన రైడ్ కోసం ఇటీవలనే తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కొత్త రైడ్, జి -ఫాల్ కోసం ముందుగా నామకరణ పోటీని నిర్వహించింది. ఇది అనేక సృజనాత్మక సూచనలను ఆకర్షించినప్పటికీ  “జి -ఫాల్” ఎక్కువ మంది ఎంపిక చేసిన పేరుగా నిలిచింది.
         ఈ సందర్భంగా వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలపిల్లి మాట్లాడుతూ, “వండర్‌లా వద్ద , మేము వినోదవంతంగా ఉత్తేజకరమైన, విప్లవాత్మకమైన అనుభవాలను సృష్టించడం అనే వినోదం యొక్క సరిహద్దులను అధిగమించటానికి అంకితభావంతో ఉన్నాము.  కొత్త రైడ్, హైపర్‌వర్స్,  లీనమయ్యే సాంకేతికత యొక్క భవిష్యత్తుకు ఒక సాహసోపేతమైన ముందడుగును సూచిస్తుంది, అద్భుతమైన రీతిలో ఊహాశక్తితో ఆవిష్కరణను మిళితం చేస్తుంది. జి -ఫాల్ విషయానికొస్తే, ఇది అసాధారణమైన థ్రిల్స్ విభాగంలోకి మా సరికొత్త ప్రయాణం, వినూత్న అనుభవాలను సొంతం చేసుకోవాలని సాహసించే వారందరికీ  మరపురాని అనుభవాలను అందిస్తుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సంచలనాత్మక ఆకర్షణలను ప్రత్యక్షంగా అనుభవించడం చూడటం కోసం ఇక మేము వేచి ఉండలేము. మేము మా అన్ని పార్కులలో కొత్త ఆవిష్కరణలు, మరింత ఉత్తేజకరమైన అనుభవాలను జోడిస్తాము” అని అన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ నటుడు మరియు ముఖ్య అతిథి నాగ చైతన్య తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “ఈ అద్భుతమైన ఆకర్షణలను వండర్‌లా హైదరాబాద్‌లో ప్రారంభించడంను ,  నేను నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. నా పని, వ్యక్తిగత జీవితంలో కొత్త అనుభవాలను అన్వేషించడంలో వర్ధిల్లుతున్న వ్యక్తిగా,  ప్రధాన గ్లోబల్ పార్కులతో సమానంగా భారతదేశానికి ప్రపంచ స్థాయి రైడ్‌లను వండర్‌లా ఎలా తీసుకువస్తోందో చూడటం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. విఆర్ -ఆధారిత అనుభవాల కోసం పెరుగుతున్న అంతర్జాతీయ ధోరణులతో సమానంగా లీనమయ్యే వినోదం అందించటంలో వండర్లా అగ్రగామిగా ఉంది. ఈ రైడ్‌లు కేవలం థ్రిల్స్ గురించి మాత్రమే కాదు-మనం వినోదం మరియు సాహసాలను ఎలా అనుభవిస్తామో వాటిని సమూలంగా  మారుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ సంచలనాత్మక రైడ్ లతో లీనమై ,  మరచిపోలేని జ్ఞాపకాలను సొంతం చేసుకుంటారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
వండర్‌లా సందర్శకులను ఆన్‌లైన్ పోర్టల్ https://bookings.wonderla.com ద్వారా ముందుగానే తమ ఎంట్రీ టిక్కెట్‌లను బుక్ చేసుకోమని ప్రోత్సహిస్తుంది లేదా కస్టమర్‌లు తమ  సందర్శన రోజున నేరుగా పార్క్ కౌంటర్‌ల నుండి టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ పార్క్‌ను : 084 146 76333 లేదా +91 91000 63636 వద్ద సంప్రదించవచ్చు.

Spread the love