గడపగడపకు బీఆర్ఎస్ విస్తృత ప్రచారం

నవతెలంగాణ – తిరుమలగిరి
బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ  మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో ఆదివారం బి ఆర్ ఎస్ నాయకులు మండల అధ్యక్షుడు సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, మాజీ గ్రంథాలయ చైర్మన్ మోడెపు సురేందర్ లు   బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ ను గెలిపించాలని కోరుతూ గడపగడపకు గత అనుభవాలను నెమరు వేసుకుంటూ బిఆర్ఎస్ గతంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ, ప్రజలకు వివరిస్తూ  విస్తృత ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ గ్రామ సర్పంచ్ ఎర్ర శోభ శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ కోర్ణ  ప్రవీణ్, నాయకులు నక్క దయా యాదవ్, కోటగిరి నరేష్, ఎర్ర సుధాకర్, తదితర బి ఆర్ ఎస్ పార్టీ  గ్రామ శాఖ  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love