Wednesday, September 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట..

కాంగ్రెస్‌ 420 హామీలపై బీఆర్‌ఎస్‌ పోరుబాట..

- Advertisement -

– వెయ్యి రోజులు గడిచినా అమలుకు నోచుకోని హామీలు 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన,
– ప్రజలకు ‘బాకీ కార్డుల’ పంపిణీ
నవతెలంగాణ-మెదక్ టౌన్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులు గడుస్తున్నా వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం మెదక్‌లో నిరసన చేపట్టారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మెదక్‌ పట్టణంలోని హెడ్‌ పోస్టాఫీస్‌ వద్ద అంబేద్కర్‌ చౌరస్తా నుంచి రాందాస్‌ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి నెరవేర్చని హామీలు 420 అడుగుల పొడవైన ఫ్లెక్సీతో ప్రదర్శన చేపట్టారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ‘బాకీ కార్డులు’ ముద్రించి ప్రజలకు పంపిణీ చేశారు. హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని వివరిస్తూ పంపిణీ చేశారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -