పదేళ్లలో నియోజకవర్గం లో బీఆర్ఎస్ చేసింది శూన్యం

– నీళ్లు, నిధులు, నియామకాల పేరున కోట్ల రూపాయలు దుర్వినియోగం.
– కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని కేసిఆర్
– ఇంటికో ఉద్యోగం ఇస్తామని మోసం చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ -పెద్దవూర: నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జయవీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం లో భాగంగా త్రిపురారం మండలం లోని బడాయిగడ్డ, డొంక తండా, ఇస్లావత్ తండా, కాన్యా తండా, సీత్యా తండా, సూర్య తండా, మంగళ్ తండా, లోక్యా తండా, రూపులా తండా, హార్జా తండా, కూన్య తండా, అప్పలమ్మ గూడెం, రాజేంద్ర నగర్, బుడ్డి తండా, దుబ్బ తండా, బొర్రాయి పాలెం, అలవాల పహాడ్, మాటూరు, చెన్నాయి పాలేం, సత్యం పహాడ్ తండా లలో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా జయవీర్ కు గిరిజన మహిళలు హారతులు ఇస్తూ నీరాజనం పట్టడం చాలా సంతోషంగా ఉందని, ఇది నాపూర్వ జన్మ సుకృతం అని,నా గిరిజన ఆడపడచులను చిరకాలం గుర్తుంచుకుంటానని అన్నారు. నీళ్లు నిధులు, నియామకాలు అంటూ అధికారం లోకి వచ్చిన కే సిఆర్ నీళ్ల పేరిట కాసళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో వేలాది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అన్నారు.నియమకాల పేరుతో వారి ఇంట్లో నలుగురికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శలు చేశారు. దళిత బందుఅని దళితులను, కేజి టు పీజీ వరకు ఉచిత విద్య అని విదద్యార్థులను, లక్ష ఉద్యోగాలు అని నిరుద్యోగుల ను, రేషన్ కార్డులు ఇవ్వక పేదవారిని, డబల్ బెడ్ రూము ఇండ్లు ఇస్తామని ప్రజలను, దళితులకు మూడేకరాల భూమి అని దళితులను, ఓకే సారి రుణ మాఫీ చేస్తామని రైతులను, గిట్టుబాటు ధర కల్పిస్తానని, అన్నదాతలను, ఫీజు రియంబర్స్ మెంట్ ఇస్తామని విద్యార్థులను, ఇలా చెప్పుకుంటూ పొతే ఇంకా చాలా వున్నాయని అన్నారు. గతంలో లక్ష రూపాయలు రుణమాఫి చేస్తామని చెప్పాము కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రుణ మాఫి చేస్తామని చెప్పి వెంటనే ఋణ మాఫీ చేశామని గుర్తు చేశారు. రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వెంటనే రైతులకు ఒకే సారీ 2,00,000 రుణమాఫీ, పేదింటి ఆడబిడ్డల పెండిళ్లకు 1,00,000 రూపాయలతో పాటు, తులం బంగారం, ఇస్తామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల మహిళలకు వారి అకౌంట్ లో 2,500 లు,
బస్సులో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, చేయూత పథకం ద్వారా ప్రతి నెల 4000 లు పెన్షన్, రాజీవ్ భీమా, రైతు భరోసా ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు లేని వారికి 5,00,000లు, ఇంటి స్థలం లేని వారికి మరో లక్ష, రూపాయలు అదనంగా ఇస్తామని తెలిపారు. ఉద్యమ కారులకు 250 చదరపు గజాల ఇండ్ల స్థలం, ఇవ్వనున్నట్లు తెలిపారు. యువ దీపిక ద్వారా విద్యార్థుల 5,00,000 లు, విద్యాభరోసా కార్డు, ప్రతి మండలం లో ఇంటర్నేషనల్ స్కూల్, అధికారం లోకి వచ్చిన వెంటనే ఈ పథకాలు అమలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుందూరు జయవీర్ రెడ్డి జెడ్ పి టీసి భారతి భాస్కర్, సర్పంచ్ మంగా కిషన్, యూత్ కాంగ్రెస్ నాయకులు నవీన్ నాయక్, శివ నాయక్, సైదా నాయక్, ధనావత్ భాస్కర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love