తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిన ఘనత బీఆర్ఎస్ దే..!

నవతెలంగాణ -పెద్దవూర: తెలంగాణలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీ లుగా తీర్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని గిరిజనులు కారుగుర్తుకు ఓటువేసి నోముల భగత్ ను గెలిపించాలని మండల అధ్యక్షులు జాటావత్ రావినాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రం లో గిరిజన ముఖ్య కార్యకర్తల సమావేశం లో మాట్లాడారు. పెద్దవూర మండల పరిధిలోని 8 గిరిజన గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డ్ మెంబర్లు, ముఖ్య నాయకులతో నవంబర్ 30 తారీకు జరిగే అసెంబ్లీ ఎన్నికల విధి విధానాల గురించి చర్చించామని అన్నారు. గిరిజన జాతి కోసం రిజర్వేషన్ 6శాతం నుంచి 10శాతం పెంచిన ఘనత కెసిఆర్ దే అని అన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్లు బంజారా భవన్, అలానే హాలియాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గ కేంద్రంలో మూడు కోట్ల రూపాయలతో బంజారా భవన్ శాంక్షన్ చేయించిన ఘనత మన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్దే అని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని, రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రమావత్ రవి నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకర్, నాయకులు శివాజీ, బాలాజీ, నాయక్ ఎస్టీ సెల్ అధ్యక్షులు రమావత్ రవి నాయక్, సీనియర్ నాయకులు రమావత్ శంకర్ నాయక్, డైరెక్టర్ రాజేష్ నాయక్, మాజీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్, ఎంపిటిసి శ్రీరాములు, సర్పంచులు బాణావత్ శంకర్ నాయక్, బాలవర్ధిరాజు, శంకర్ నాయక్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love