బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల పరామర్శ

నవతెలంగాణ పెద్దవంగర:
మండలంలోని కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు కర్ర అశోక్ రెడ్డి తల్లి కర్ర కొములమ్మ ఇటీవల వృద్ధాప్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు బియ్యల సోమేశ్వర్ రావు, మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. వారి వెంట నాయకులు మండల రైతు కోఆర్డినేటర్ పాకనాటి సోమారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్ కుమార్, నాయకులు శ్రీరాం సుదీర్, బొమ్మెరబోయిన రాజు, పాకనాటి సునీల్ రెడ్డి, మద్దెల ఆంజనేయులు, కాసాని కుమార్, మండల యూత్ అధ్యక్షుడు కాసాని హరీష్, తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, తాండాల చంద్రయ్య ఉన్నారు.
Spread the love