కామ్రేడ్లపై బీఆర్‌ఎస్‌ నేతలనజర్‌ – కార్యకర్తలపై ఫోకస్‌

నవతెలంగాణ-హన్మకొండ
గత సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కా మ్రేడ్లపై కత్తి పట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత మును గోడు ఎన్నికల్లో మళ్ళీ కామ్రేడ్లను అక్కున చేర్చుకున్నా రు. మునుగోడు ఎన్నికల్లో కామ్రేడ్ల సహాయంతో గెలి చామని పలు వేదికలపై గొప్పలు చెప్పుకున్నారు. దీంతో కామ్రేడ్లు కూడా జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపి ల ను వదిలి బీఆర్‌ఎస్‌తో చెలిమికి సిద్ధమయ్యారు. ఎన్నిక ల షెడ్యూల్‌ విడుదలకు ముందు కూడా సీపీఐ, సీపీఎం లకు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నాడని ఇరువురి మధ్యన పొత్తు కుడురినట్లేనని అంతా భావించారు. సీపీ ఎం, సీపీఐ నాయకులు కూడా ఎట్టి పరిస్థి తుల్లో అటు బీజేపీగాని ఇటు కాంగ్రెస్‌ కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావద్దని తమ కార్యకర్తలను సిద్ధం చేయించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అనుకున్నట్లు జరిగితే ఆ యన కేసీఆర్‌ ఎందుకు అవుతారు? నమ్మి నిదానంగా ఉన్న కామ్రేడ్‌లను కెసిఆర్‌ కనీ సంసంప్రదించకుండానే ఏకపక్షంగా 115 సీట్లను ప్రకటించారు. దీంతో చేసేదేమీలేక సీపీఎం, సీపీఐపార్టీల నాయకులు కాంగ్రె స్‌ నాయకత్వంతో చర్చలు జరుగుతున్న దశలోనే వరం గల్‌లో బీఆర్‌ఎస్‌ తన రాజకీయ లబ్దికోసం కామ్రేడ్‌ నా యకులను కాదని కార్యకర్తలపై జులుం ప్రదర్శించి తమ పార్టీలో బలవంతంగా చేర్చుకుంటున్నారు. గురువారం రాత్రి వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్న పనేని నరేందర్‌ పలు ప్రాంతాల్లో గుడిసెలు వేసుకున్న ప్రాంతాల్లో నివసిస్తున్న నాయకులను అక్రమంగా అరె స్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ గుడిసెల్లో ఉ న్న కార్యకర్తలపై తన మంది మార్బలంతో దాడి చేసి వా రిని బలవంతంగా టిఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకొని కామ్రే డ్లను బలహీనపరిచే కుట్ర చేస్తున్నారు. అయితే ఈసారి మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ కొడతామన్న బిఆర్‌ఎస్‌ పార్టీకి కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలో ఏకపక్షంగా గెలుస్తామని భావించిన టిఆర్‌ఎస్‌ పార్టీ ఎర్రదండు బలమెంతో ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది.
నగరంలో సీపీఎం, సీపీఐ పార్టీల మద్దతుతో గుడ ిసెలు వేసుకున్న ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు ఒకవైపు పోలీసులతో మరోవైపు తమ కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం… అయితే నా యకులతో చర్చలు జరిపితే వారు ఎలాగైనా అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగరని భావించిన నాయకులు పోలీ సులతో బలవంతంగా అక్రమ కేసులు బనాయించి వా రిని పోలీస్‌స్టేషన్లో నిర్భందించి అమాయకులైన గుడిసె వాసులకు మీకుఇండ్లు కట్టిస్తామని నమ్మబలికి బలవం తంగా తమ పార్టీలో చేర్చుకుంటున్నారని స్థానిక నాయ కులు చెప్తున్నారు.
అధికార పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి కామ్రేడ్లతో చర్చలు జరిపి అధికారికంగా పొత్తు ఏర్పరచుకొని ఎన్ని కలకు వెళ్లాలని ఇలాదొడ్డి దారిన అమాయకులను బల వంతంగా తమ పార్టీలో చేర్చుకొని గెలవాలని ప్రయ త్నిస్తే తగిన గుణపాఠం తప్పదు.

Spread the love