కాంగ్రెస్ లోకి బీఆర్‌ఎస్‌ నాయకులు

నవతెలంగాణ- రామారెడ్డి:  మండల బీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం ఎల్లారెడ్డి పట్టణంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. చేరిన వారిలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అప్రోజ్, విద్యార్థి విభాగం అధ్యక్షులు సిహెచ్ రవి, ధర్మారం శ్రీశైలం, ఒంటరి నరసారెడ్డి, తదితరులు చేరారు. కార్యక్రమంలో నాయకులు అంబాయి ప్రసాద్, మేదర్ గోపి, గొల్లపల్లి కిషన్ యాదవ్, నామాల రాములు, తదితరులు ఉన్నారు.
Spread the love