నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేమ్రాజ్ కల్లాలీ గ్రామములో మాజీ సర్పంచ్ కాంగ్రేస్ పార్టీ సీనీయర్ నాయకుడు రమేష్ దేశాయి, మండలపార్టీ అద్యక్షులు సంజీవ్ పటేల్ అద్యక్షతన గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ నుండి చేరికలు వందల మందికి ఎమ్మెలే తోట లక్ష్మీ కాంతారావ్ కాంగ్రేస్ కండువాలు కప్పిపార్టీ లోకి తీసుకోవడం జరిగింది. ఈ సంధర్భంగా ఎమ్మెలే మాట్లాడుతూ.. పార్టీ ప్రసిడెంట్, సీనీయర్ నాయకులందరు కష్టపడి ఎంపి అబ్యర్థీ సురేష్ శెట్కర్ భారీ మేజార్టీ అందిచి గెలిపించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయి నుండి కార్య కర్తలు తామంతా అండగా ఉంటామని, అందిరికి సమాన దృష్టి పెట్టి కాంగ్రేస్ పార్టీ పటిష్టకు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రాస్ సీనియర్ నాయకులు , చేరిన ముఖ్య నాయకులు పండరి, తులసిరామ్, గణేష్ , నాగేష్, బాగం విజయ్, రాములు, మైలార్ శంకర్, నర్సింగ్, సతీష్, మారుతీ , యువకులు పార్టీలోకి చేరడం జర్గింది.