బీఆర్ఎస్ అంటేనే సంక్షేమం.

– ఇముల్ నర్వా లో ఎన్నికల ప్రచారం.
– షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.
నవతెలంగాణ- కొత్తూరు: బీఆర్ఎస్ అంటేనే సంక్షేమం సంక్షేమం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారమైన మండలంలోని ఇముల్ నర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. ముందుగా ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి దళితవాడలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని పలు వీధులలో పర్యటించి నేరుగా ఓటర్లను కలిసి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రజలకు వివరించి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పరిపాలించినా రాష్ట్రానికి చేసిందేమి లేదని అన్నారు. స్వతంత్రానికి ముందు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఉండేదని గుర్తు చేశారు. ఆంధ్ర పాలకులు తమ స్వార్ధ ప్రయోజనాల కొరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తన ప్రాణాలు లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపారని అన్నారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ సాధన కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రమేర్పడిన అనంతరం షాద్నగర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధిని సాధించిందని అన్నారు. అభివృద్ధికి చిహ్నమైన కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీలో భాగస్వాములు కావాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజయ్ నాయక్, జడ్పిటిసి ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మెండే కృష్ణ యాదవ్, వైస్ ఎంపీపీ శోభ లింగం నాయక్, నాయకులు పెంట నోళ్ల యాదగిరి గోపాల్ నాయక్, ఉప సర్పంచ్ శ్రీరాములు యాదవ్, బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రషీద్, సీనియర్ నాయకులు నాగర్ కుంట నవీన్ రెడ్డి, కడంపల్లి శ్రీనివాస్ గౌడ్, బాతుక దేవేందర్ యాదవ్, వడ్డే బాలయ్య, సర్పంచులు బి సత్తయ్య, కాట్న రాజు, సంతోష్ నాయక్, ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు కడల శ్రీశైలం, మున్సిపల్ వైస్ చైర్మన్ డోలి రవీందర్, బిఆర్ఎస్ నాయకులు దామోదర్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, నేనావత్ గోపాల్ నాయక్, బి రాజు, జోగు బాలరాజు, కర్రోళ్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు
Spread the love