బిజెపి పార్టీలో చేరిన బీఆర్ఎస్ యువత

నవతెలంగాణ-రాయపోల్; బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలన పై విసుగు చెంది బీఆర్ఎస్ నుండి యువత బిజేపి పార్టిలో చేరడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. బుధవారం రాయపోల్ మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ నియంత్రితో పాలకు చరమగీతం పాడాలని సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల మూడు నియోజకవర్గాలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కేసీఆర్ కుటుంబం సంపద పెంచుకుంటున్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్రెలు, మేకలు,గేదెలు ఇస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. బిజెపిలో పార్టీలో చేరిన వారు  చందు, మహేష్ గౌడ్, యాదగిరి, వేణు, కృష్ణ, సంతు, పరశురాములు, రవి కుమార్, జీవన్, రవి, గణేష్, శ్రీకాంత్, దాసు, కనకరాజు, చందులను ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి బిజెపిలోకి ఆహ్వానించారు.  సుమారు 20 మంది కార్యకర్తలు బిజెపిలో చేరారు.కేంద్ర ప్రభుత్వం  చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి తమ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు బిజెపి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు మాదాస్ వెంకట్ గౌడ్, సీనియర్ నాయకులు రాజా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love