Thursday, July 30, 2026
E-PAPER
Homeఖమ్మంఎస్ఐఆర్ ప్రక్రియపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి

ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి

- Advertisement -

– క్షేత్రస్థాయిలో పర్యటించిన నాయకులు
– అర్హుల పేర్లు నమోదు చేయాలని సూచన
నవతెలంగాణ – అశ్వారావుపేట
: మండలంలోని బచ్చువారిగూడెం, గుమ్మడవల్లి, కోయ రంగాపురం, వినాయకపురం గ్రామాల్లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు నమోదు ప్రక్రియను బీఆర్ఎస్ నాయకులు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీఆర్ఎస్ మండల సమన్వయ కర్త జూపల్లి రమణరావు,మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు జల్లిపల్లి శ్రీ రామ మూర్తి, సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు సంక ప్రసాద్, మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో గ్రామాల్లోని బూత్ లెవల్ అధికారులను (బీఎల్ఓలు) కలిసి నమోదు పురోగతి, పెండింగ్ దరఖాస్తులు, అర్హుల వివరాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఇంకా నమోదు కాని అర్హులను గుర్తించి వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగిన వారి వివరాలను నిబంధనల మేరకు పరిశీలించాలని అధికారులకు సూచించారు. నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయింపుకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామాల వారీగా ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఓ లక్ష్మి, బీఎల్ఏ లు ఎల్లయ్య,కురేష్, సాయిల సత్యం, సాయిల బాబురావు, గ్రామ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సాయిల మల్లికార్జునరావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -