ఒకేసారి జనగణన, బడిబాట
ఒక్కొక్కరు 150 కుటుంబాలను సర్వే చేయాలి
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు జనగణన సర్వే చేయాల్సి ఉండగా,14వ తేదీ నుంచి జూన్ 19 వరకు బడిబాట నిర్వహించాల్సి ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.కాగా ఈ రెండు కార్యక్రమాలను ఒకేసారి చేపట్టాల్సి వస్తుంది.ఈ నేపథ్యంలో ఎలా నిర్వహించాలో అర్థం కాక ప్రభుత్వ టీచర్లు తలలు పట్టుకుంటున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున రెండు కార్యక్రమాల్లో పాల్గొనడం కత్తిమీద సాములా మారిందని వాపోతున్నారు.జనగణనలో భాగంగా ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు నమోదు చేస్తుండగా,బడిబాటలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ఉపాధ్యాయులు మల్లగుల్లాలు పడుతున్నారు.
మండలంలో..
మండలంలో అన్ని గ్రామాల్లో జగణనలో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించేందుకు 54 మంది ఉపాధ్యాయులు, ఎన్యూమరేటర్లు,50 మంది,నలుగురు ఉపాధ్యాయులు సూపర్వైజర్లుగా పనిచేస్తున్నారు.ఒక్కో ఎన్యూమరేటర్ 150 కుటుంబాలను,4 మంది సూపర్వైజర్లు ఎన్యూమరేటర్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సర్వేలో ఎలాంటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది.అలాగే జనగణనతో పాటు బడి బాట కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటంతో ఉపాధ్యాయులు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు.ఈ నేపథ్యంలో బడిబాటను వాయిదా వేయాలనే అభిప్రాయం వారి నుంచి వ్యక్తమ వుతోంది.
బడిబాట షెడ్యూల్..
బడిబాట ప్రారంభంలో భాగంగా ఈ నెల 14న తల్లిదండ్రులతో సమావేశం.21న అంగన్వాడీ టీచర్లు, మదర్ కమిటీ లతో సమావేశం.28న యువత, స్థానిక నాయకులతో సమావేశం.జూన్ 3న గ్రామసభ,4న అవగాహన ర్యాలీ, 5న ప్రత్యేక అవసరాలు గల పిల్ల లను గుర్తించడం.6న బడి బయట పిల్లలను గుర్తించుట.8 నుంచి 10వ తేదీ వరకు ఇంటింటి ప్రచారం.12న వెల్కమ్ డే,15న సామూహిక అక్షరా భ్యాసం,16న ఎఫ్ఎల్ఎన్డే,17న గర్ల్ చైల్డ్ ఇనూసివ్ ఎడ్యుకేషన్ డే,18న డిజి టల్ అవేర్నెస్ డే, 19న స్పోర్ట్స్ డేతో బడిబాట ముగిస్తుంది.



