బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దిష్టిబొమ్మ దగ్ధం

నవతెలంగాణ-వీణవంక
ప్రభుత్వ పథకాలను నిలుపదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వీణవంక మండల కేంద్రంలోని బస్టాండ్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ కరోనా కంటే డేంజర్ గా కాంగ్రెస్ పార్టీ మారిందని, రైతుల బాగుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ రైతులను ముంచేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని అనేక మార్గాలను ఎంచుకుంటోందని, అందులో భాగంగానే ఎన్నికల సంఘానికి ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్ థాక్రే ద్వారా ఫిర్యాదు చేయించిందని ఆరోపించారు.
కర్ణాటకలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అక్కడి ప్రజలను నట్టేట ముంచి మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకునేందుకు ప్రయత్నిస్తొందని విమర్శించారు. రానున్న ఎన్నికలల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, మాడ సాధవరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, సర్పంచ్ నీల కుమారస్వామి, నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి, అడిగొప్పుల సత్యనారాయణ, ఓరెం భానుచందర్, తాళ్లపల్లి మహేష్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మర్రి శ్రీనివాస్ యాదవ్, కొండల్ రెడ్డి, యాసిన్, చింతల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love