– బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: దండు మల్కాపురం గ్రామంలో 68, 69, 71 బూతులలో తొలి ఓటర్లతో బీఆర్ఎస్ చౌటుప్పల్ మండలం అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్ బుధవారం మ్యానిఫెస్టోతో ప్రచారం నిర్వహించారు. మునుగోడు ముద్దుబిడ్డ అభివృద్ధి ప్రదాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మరొకసారి గెలిపించి అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలువర్తి యాదగిరి, ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాసరావు, ఉపసర్పంచ్ మల్కాజ్గిరి కృష్ణ, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఈడ్డుల మస్తాన్ బాబు, రామలింగేశ్వర స్వామి కమిటీ చైర్మన్ సుంకరి సత్యనారాయణ గౌడ్, రైతుబంధు గ్రామ శాఖ అధ్యక్షులు బోయినీ లింగస్వామి, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి మహంకాళి పృద్వి, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు