చర్చ సాగేనా..?

– రేపు మండల పరిషత్ చివరి సమావేశం
– అరకొర నిదులతో ముగియనున్న పదవీకాలం
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిస్కారనికి మండల పరిషత్ ప్రధాన వేదికగా నిలుస్తోంది.మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు మండల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికల రూపకల్పనలోనూ పాత్రను పోషిస్తోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన మండల పరిషత్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు నామమాత్రంగా మారింది. గడిసిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి అందకపోవడం,కేంద్రం నుంచి సైతం అరకొర నిధులే రావడంతో మండల అభివృద్ధిపై పాలకవర్గం ముద్ర కనిపించకుండా పోయింది. ప్రజా సమస్యలపై చర్చించి,వాటి పరిస్కారనికి భరోసా కల్పించాల్సిన అధికార,వివక్ష సభ్యులు పరస్పర విమర్శలలు తావివ్వకుండా,మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించినప్పటికి మండల అభివృద్ధికి మాత్రం తనవంతుగా మండల పరిషత్ అధ్యక్షుడు చింతలపల్లి మలహల్ రావు కృషి ఎనలేనిది.ప్రతిపక్షంలో  అప్పటి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తోపాటు ఉన్నతాధికారులను కలుస్తూ మెరుగైన రవాణా,విద్య,వైద్యం అందరికి అందేలా పోరాటం, మండల స్థాయి అధికారులను, ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు సమన్వయ పరుస్తూ,సభ్యులు సమావేశాలకు హాజరైయ్యేలా చూస్తూ సమావేశాలు సాపిగా నిర్వహించడం మరో విశేషం. ప్రభుత్వంలో అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే ప్రస్తుత మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు సహకారంతో రైతులకు పొలాల వద్దకు వెళ్ళేందుకు మట్టి,సిసి రోడ్లతో రవాణా సౌకర్యాలు, ముఖ్యంగా కిషన్ రావు పల్లి నుంచి అటవీప్రాంతం మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రోడ్డు మార్గం అయ్యేలా ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే  పదవీకాలం వచ్చేనెల 5తో ముగియనుంది.ఈ క్రమంలో సోమవారం నిర్వహించనున్న సర్వసభ్య సమావేశం ఈ పాలక వర్గానికి చివరిది కానుంది. ఈ సమావేశంలో ఆయిన ప్రజా పరిషత్ సభ్యులు సమస్యలపై చర్చించి భరోసా కల్పిస్తారా.? లేక సభ్యుల సన్మానాలతోనే ముగిస్తారా అనేది ఆసక్తి కరంగా మారింది.
Spread the love