భరించలేక పోతున్నారా?

భరించలేక పోతున్నారా?మారుతున్న జీవన విధానం, పని వేళల్లో మార్పులు, మారిన వర్క్‌ కల్చర్‌… కారణం ఏదైనా చాలా మంది ఒత్తిడితో ఇబ్బంది పడుతు న్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ టెన్షన్‌తో కూడిన జీవితం కారణంగా చాలా మంది మానసిక సమస్యల బారిన పడుతున్నారు. దీంతో మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్నిరకాల చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
– సంగీతం వినడం వల్ల మాననసిక స్థితితో పాటు భావోద్వేగాలను చాలా వరకు మెరుగుపరుస్తుంది. ఇది మనల్ని సంతోషంగా ఉంచడంలో సహాయ పడుతుంది. రోజులో కొంత సేపు సంగీతం వింటే ఒత్తిడి తగ్గి మైండ్‌ రిలాక్స్‌ అవుతుంది.
– ఏదైనా పుస్తకాన్ని చదవడం వల్ల కూడా ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో కొద్ది సేపు పుస్తకం చదవడం వల్ల మనసుకు టెన్షన్‌, ఒత్తిడి లేకుండా ఉంటుంది. మనస్సును రిలాక్స్‌గా ఉంచడానికి చదవడం సులభమైన మార్గం.
– మానసిక ఒత్తిడిని తగ్గించడంలో శారీరక వ్యాయామం కూడా ఎంతగానో ఉపయోగ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతీ రోజూ వాకింగ్‌, యోగా, రన్నింగ్‌ వంటి వాటితో మనసు ప్రశాంతంగా మారుతుంది.
– ఎక్కువ సేపు పనిచేసిన తర్వాత ఏర్పడే ఒత్తిడిని తగ్గించటంలో ధ్యానం బాగా పనిచేస్తుంది. ఉదయం లేదా సాయంత్రం, ఏకాంత ప్రదేశంలో కూర్చుని, కళ్లు మూసు కుని శ్వాసపై దృష్టి పెట్టాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తే మార్పు మీరే స్పష్టంగా గమనిస్తారని నిపుణులు చెబుతు న్నారు.
– ఇక పనిలో ఎంత బిజీగా ఉన్న ప్రతీ రోజూ కొద్ది సేపైనా మీకు కావాల్సిన వారితో మాట్లాడాలని చెబుతున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా గడపాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది.

Spread the love