బీజేపీని ఓడించడమే నిజమైన దేశభక్తుల కర్త్యవ్యం : సీసీఎం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం నిజమైన దేశభక్తుల కర్తవ్యంగా తీసుకోవాలని సీసీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పద్మావతి ఫంక్షన్ హాలులో ఎండి పాషా,దండ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన పట్టణ విస్తృతస్థాయి సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నా రాజ్యాంగ విలువలను ప్రజల యోగక్షేమాలను మరిచి ప్రభుత్వ పథకాల అమలును నిర్వీర్యం చేస్తున్నారని అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలను ప్రజలకు అంటగట్టి రాజకీయం చేయాలని చూస్తుందని వారన్నారు.మొదటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు,జన్ ధన్ యోజన కింద ప్రజల అకౌంట్లోకి 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయాయని వారు ప్రశ్నించారు.అదేవిధంగా రైతుల పొట్టకొట్టే నల్ల చట్టాలను తీసుకురావడం, పోరాడి సాధించిన కార్మిక చట్టాలను సవరణల పేరుతో తగ్గించడం అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మతం పేరుతో కులం పేరుతో ఉమా దాన్ని ప్రేరేపిస్తుందని,దేశ అభివృద్ధిని మరిచిపోయి రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని ఉపాధి విద్యను విస్మరిస్తుందని వారన్నారు.బిజెపి అధికారంలో ఆర్థిక పురోగతి మరిచి కార్పోరేట్ సేవ చేస్తుందని,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం ప్రభుత్వ వాటాలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడం అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వారన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని వీటి మీద సిపిఎం పార్టీగా దశల వారి కార్యక్రమాలు చేపట్టి ప్రజా సమస్యలను పరిష్కారం చేసే దిశగా సిపిఎం నాయకత్వం ముందుండాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీసీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ వీరితోపాటు సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి,పట్టణ కార్యదర్శి బండారు నరసింహ,జిల్లా కమిటీ సభ్యులు అవ్వారు రామేశ్వరి,గడ్డం వెంకటేష్ నాయకులు ఈర్లపల్లి ముత్యాలు,గుండు నరసింహ,ఆకుల ధర్మయ్య,బత్తుల దాసు,ఉష్కాగుల శ్రీనివాస్,ఎర్ర ఉషయ్య,చేకూరి ఈదయ్య,స్వామి, రమేష్,గోశిక స్వామి,జయమ్మ,యాదమ్మ, మల్లేష్,ప్రకాష్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love