ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

Celebration of Milad Un Nabiనవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కరీంపేట గ్రామంలో మజీద్ మౌలాన మహమ్మద్ సల్మాన్ రజా ఆద్వర్యంలో మిలాద్ ఉన్ నబీ వేడులకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో సర్వమత శ్రేయస్సు కోసం ముస్లీం మతస్తులు, గ్రామంలో ర్యాలి నిర్వహించారు.హిందువులు ముస్లిం మతస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ‌కార్యక్రమంలో మండల మాజి కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఖాజాపాషా, మజీద్ అధ్యక్షులు మహమ్మద్ అజిమోద్దీన్, సర్దార్, చాన్ పాషా, అఫ్జల్, జాకీర్, ఖాజా, జావీద్, సమేద్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love