ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాగిరెడ్డిపేట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు రెడ్డి కోఆప్షన్ సభ్యుడు షాహిద్ పాష, లక్ష్మణ్, ఇమామ్, దివిటీ కిష్టయ్య,  శ్రీరామ్ గౌడ్,  నరసింహారెడ్డి, ఫారూఖ్ సాబ్, సాయ గౌడ్, సంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love