సెంటర్ దాటితే వరి ధాన్యం బాధ్యత రైతులది కాదు..

– జాతీయ కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కోదండ రెడ్డి..
– వరి ధాన్యం కొనుగోలు చేసిన ప్రింటెడ్ రసీదు రైతులకు ఇవ్వాలి..
– ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని రకాల మార్పులు చేస్తాం..
– గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు..
– పది సంవత్సరాల పాటు వ్యవస్థనంతా చెత్తగా తయారు చేశారు
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
సెంటర్ దాటితే వరి ధాన్యం బాధ్యత రైతులది కాదని జాతీయ కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కోదండ రెడ్డి అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర కిసాన్ సంఘం అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుండి రైతులను అన్యాయం జరిగిందని ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి ప్రతి విషయంలో  రైతులను టిఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలలో 40 కిలోల సంచికి అధికంగా రెండు కిలోల 200 గ్రాములు అధికంగా తూకం వేయడం పై ఆయన పరిశీలించారు.  రైతుల వద్ద నుండి కేవలం 41 కేజీ 500 గ్రాములు మాత్రమే తూకం వేయాలని ఆయన అన్నారు. గత ప్రభుత్వం విధించిన విధి వధానాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని వాటిని పరిశీలించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదికలు సమర్పించనున్నట్లు వారు పేర్కొన్నారు. రైతులకు ధాన్యం విక్రయించిన తర్వాత తెల్లగాగితం కాపై కాకుండా రసీదు ఇవ్వాలని ఆయన సీఈఓ జైపాల్ రెడ్డికి సూచించారు. రైతులకు ఇస్తున్న రసీదుపై హమాలీలకు చెల్లిస్తున్న 36 రూపాయల వివరాలు కూడా ఆ రసీదు నందు నమోదు చేయాలని సీ ఈ వో కు ఆయన సూచించారు. రైతు దగ్గర నుండి ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతాయని కేవలం రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరిస్తుందని ప్రతి విషయాన్ని రైతులకు నేరుగా ఉన్న  ఇబ్బందులను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల దగ్గర నుండి తూకం పేరుతో రైస్ మిల్లర్లు రైతులకు అన్యాయం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రైతు ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి తూకం వేసిన తర్వాత మిగతా బాధ్యత అంతా కొనుగోలు కేంద్రాన్ని అవుతుందని మిగతా విషయాలన్నీ వారే చూసుకోవాల్సి ఉంటుందని రైతుకు ఎలాంటి సంబంధం లేదని  రైతులను ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదని ఆయన సూచించారు. పార్ట్ బి పార్ట్ సి లో ఉన్న ధరణి వెబ్సైట్లో ఉన్న రైతుల భూములకు సంబంధించి ప్రతిదీ జూన్ 4లోపు పరిష్కారం కావడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వారి వెంట ప్రాథమిక సహకార సంఘ అధ్యక్షుడు ఆకిడి గంగారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు రామచంద్రారెడ్డి ,బోయిని విట్టల్, ది విటి కిష్టయ్య ,వేముల సంగయ్య, సంజీవులు, వాసురెడ్డి, హైమద్ మధు తదితరులు ఉన్నారు.
Spread the love