లహరితో చిల్ అంటూ సజ్జనార్ ట్వీట్..

నవతెలంగాణ – హైదరాబాద్: హైటెక్ హంగులతో రూపొందించిన లహరి ఏసి స్లీపర్ ఏసి స్లీపర్ కం సీటర్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి మనకి తెలుసు. ప్రయివేట్ ట్రావెల్ బస్సులకి ధీటుగా ఈ బస్సులుని రూపొందించారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. వేసవిలో చల్లదనం అందించడానికి టీఎస్ఆర్టిసి లహరి ఏసి స్లీపర్ కం సీటర్ బస్సు సేవల్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ బస్సులు హైదరాబాద్ నుండి బెంగళూరు తిరుపతి చెన్నై వైజాగ్ విజయవాడ మంచూరియాల ఆదిలాబాద్ నిజామాబాద్ నాగపూర్ షిరిడి సత్తుపల్లి తదితర మార్గాల్లో అందుబాటులో ఉన్నాయని సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు ప్రస్తుతం పోస్ట్ ఆసక్తికరంగా మారింది. వీడియోని కూడా షేర్ చేశారు.

Spread the love