ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – రాయపర్తి
కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకను మంగళవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల నాయకులు ముఖ్యఅతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడని కొనియాడారు. రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం పెరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు జాటోత్ హమ్య నాయక్, మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, మండల నాయకులు మాచర్ల ప్రభాకర్, ఏసీరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రెంటాల గోవర్ధన్ రెడ్డి, కృష్ణ రెడ్డి, గొబ్బెట బాబు, సుదర్శన్ రెడ్డి, వనజ రాణి, అనుబంధ సంఘాల నాయకులు ఎండీ అఫ్రోజ్, చిర్ర మల్లయ్య, గుగులోతూ శ్రీనివాస్, మచ్చ కుమారస్వామి, మచ్చ రమేష్, కోతి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love