ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపు సంబరాలు..

నవతెలంగాణ – వీర్నపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచినందుకు శనివారం మండల కాంగ్రెస్ కమిటీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న మొదటి రౌండ్ లోనే గెలిచేవాడని ఆయనపై ఉన్న అత్యధికమైన ప్రేమతో బ్యాలెట్ పేపర్లపై 20వేల మంది పట్టభద్రులు తీన్మార్ మల్లన్న జై అంటూ రాయడం మూలంగా రెండో రౌండ్ ను లెక్కించడం జరిగిందన్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేయడం జరిగిందని ఎన్నో కేసులు కూడా భరించారని అన్నారు. చివరికి తీన్మార్ మల్లన్న ను అపహరించి జైలులో కూడా వేయడం జరిగిందన్నారు. పట్టభద్రులు అన్ని రకాల ఆలోచించి వరంగల్ ఖమ్మం నల్గొండ ఓటర్లు మంచి మెజార్టీతో గెలిపించడం పట్ల ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ లాగా పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఈ గెలుపు అద్దం పడుతుందన్నారు. అలాగే పార్లమెంటు ఎన్నికలలో 8 ఎంపీ సీట్లు గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలను గ్రామ గ్రామాన తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కే గౌస్ , జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి , పందిర్ల లింగం గౌడ్, మేడిపల్లి దేవానందం, మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు,అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్, రాంరెడ్డి,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజేందర్, మండల యువజన అధ్యక్షులు బానోతు రాజు నాయక్,నాయకులు గంటా బుచ్చగౌడ్,  ఎండి రఫీక్, అనవేని రవి, దండు శ్రీనివాస్, సిరిపురం మహేందర్ ,నరేందర్ మధు,ఎల్లన్న ,శ్రీపాల్  రెడ్డి, ఏలూరి రాజయ్య ,బండారి  బాల్ రెడ్డి, నంది కిషన్,బాలా గౌడ్ ,పందిర్ల సుధాకర్ గౌడ్, గంట వెంకటేష్ గౌడ్ ధర్మేందర్, జితేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love