విద్యార్థులలో నైపుణ్యం పెంచేందుకే సంబరాలు 

– అల్పోర్స్ పాఠశాల అధినేత నరేందర్ రెడ్డి
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకమైన పండగ సంక్రాంతి ని తెలియజేసేలా విద్యార్థులకు ప్రతి అంశంపై నైపుణ్యం పెంచేందుకు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు అల్పో ర్స్ పాఠశాల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని ఆల్పోర్స్ పాఠశాలలో సంక్రాంతి ముందస్తు పండుగ సంబరాలు నిర్వహించారు. భోగి మంటలు, విద్యార్థులు కోలాటాలు, గంగిరెద్దుల విన్యాసాలు, విద్యార్థుల ఆటలు పాటలతో పాఠశాలలో సందడి చేశారు.

Spread the love