– దాయాదుల మ్యాచ్‌కు తరలిన తారలు
దుబాయ్ : భారత్, పాకిస్థాన్ మ్యాచ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరు జట్ల అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ప్రియులు సైతం దాయాదుల ఢ కోసం ఎదురు చూస్తారు. ఈసారి దాయాదుల పోరుకు వేదిక దుబాయ్ కావటంతో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు స్టేడియానికి తరలి వెళ్లారు. సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు సుకుమార్, యువ క్రికెటర్ తిలక్ వర్మ, అభిషేక్ శర్మ ఓ స్టాండ్‌లో నుంచి మ్యాచ్‌ను తిలకించారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్, బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరారు, ప్రభుత్వ క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌లు మ్యాచ్‌ను తిలకించారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తోడుగా ఎంపీ, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని చిన్ని మ్యాచ్‌ను వీక్షించారు.