కాళేశ్వరంపై కేంద్రం ఆరా

Center Aura on Kaleswaram–  చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం : రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ డేటా కేంద్రానికి ఇవ్వడం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. ఆదివారంలోపు ప్రాజెక్టుకు సంబంధించి సమాచారమివ్వాలని గడువు విధించింది. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాచారం లేదని భావిస్తామని లేఖలో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణానికి సంబం ధించి 20 రకాల సమాచా రాన్ని కేంద్ర డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ అడిగింది.
కాగా, ఇప్పటివరకు మూడు అంశాలపై మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఒక దానికి పాక్షిక సమా ధానమిచ్చింది.మిగతా 16 అంశాలపై తెలంగాణ ప్రభుత్వం సమాచారమే ఇవ్వలేదు. అలాగే ప్రాజెక్టు క్వాలిటీ, జియలాజికల్‌ స్టడీ, కాంట్రాక్టర్‌ లయబిలిటీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. దీంతో డ్యామ్‌ సేఫ్టీ అథా రిటీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది.
సమాచారంలో ఇచ్చిన అంశాలు
1.పునాది పొరలకు సంబంధించిన జియో లాజికల్‌, జియోటెక్నికల్‌ వివరాలు, బోర్‌హౌల్‌ లాగ్‌ వివరాలు, ఎస్‌పిటి ఫలితాలు, ప్లేట్‌ లోడ్‌ పరీక్ష ఫలితాలు మొదలైనవి.
2. బ్యారేజీ రూపకల్పన లెక్కలు. హైడ్రాలిక్‌ (ఉపరితలం, ఉపరితల), స్థిరత్వం. సేఫ్‌ ఎగ్జిట్‌ గ్రేడియంట్‌ లెక్కింపు, వివిధ డిజైన్‌ పరిస్థితుల కోసం తెప్ప కింద ఒత్తిడి మొదలైనవి.
3. ఫిజికల్‌ మోడల్‌ స్టడీ రిపోర్ట్‌
పాక్షికంగా ఇచ్చిన సమాచారం
1. బ్యారేజ్‌ సంబంధిత డ్రాయింగ్‌లు
సమాచారం ఇవ్వని అంశాలు
1.బ్యారేజీకి సంబంధించిన ఇన్‌స్ట్రుమెంటే షన్‌ డేటా (పైజోమీటర్‌, స్ట్రెస్‌ సెల్స్‌ మొదలైనవి ఇప్పటి వరకు)
2. ఇప్పటి వరకు బ్యారేజీలో గమనించిన అన్ని కష్ట పరిస్థితుల వివరాలు.
3. సెటిల్‌మెంట్‌ను చూపే నిర్మాణ సంబంధిత సెక్షనల్‌ డ్రాయింగ్‌లు.
4. భౌగోళిక ప్రొఫైల్‌లను చూపే నిర్మాణ సంబంధిత సెక్షనల్‌ డ్రాయింగ్‌లు.
5. బ్యారేజీని నిర్దేశిత ఆనకట్టగా చేర్చినందున, రుతుపవనాల ముందు, తరువాత తనిఖీ నివేదికలు, ఈఎపి మొదలైన ఎన్‌డిఎస్‌ఎ సంబంధిత సమాచారం.
6.ఫౌండేషన్‌ మెరుగుదల పనులు, ఏదైనా ఉంటే.
7. నాణ్యత నియంత్రణ నివేదికలు.
8. థర్డ్‌ పార్టీ పర్యవేక్షణ నివేదికలు, ఏదైనా ఉంటే.
9.రుతుపవనాలకు ముందు, రుతుపవనాల అనంతర క్రాస్‌-సెక్షన్లు/బ్యారేజీని ప్రారంభించిన ప్పటి నుండి యు/ ఎస్‌, డి/ ఎస్‌లలో వాస్తవ తిరోగమనం.
10. లోపాల బాధ్యత కాలానికి సంబంధించి ఒప్పంద సంబంధిత నిబంధనలు.
11. అన్ని భాగాలను కలిగి ఉన్న ప్రతి బ్లాక్‌ పూర్తి నివేదికలు.
12. బేరింగ్‌ల ఫొటోగ్రాఫ్‌లు అప్‌ స్ట్రీమ్‌, డౌన్‌ స్ట్రీమ్‌ రెండింటిలోనూ ఉన్నాయి.
13. అన్ని పైర్‌లలోని పగుళ్ల మ్యాపింగ్‌.
14. డబుల్‌ పీర్‌ కింద అడ్డంగా ఉండే సెకాంట్‌ పైల్‌ కట్‌-ఆఫ్‌ను చూపుతున్న డ్రాయింగ్‌. పైర్‌తో ఫైల్‌ల పైభాగంలో చేరడం గురించి వివరించడం.
15. బ్లాక్‌ నంబర్‌ 7లోని అన్ని గేట్ల పరిస్థితి.
16.బ్లాక్‌ నంబర్‌ 7లో స్టాప్‌ లాగ్‌ గ్రూవ్‌ల పరిస్థితి.
బ్యారేజీల్లో సమస్యలు సహజమే..
మరోవైపు.. ఇసుకపై పునాదులు వేసి కట్టే బ్యారేజీల్లో సమస్యలు సహజమేనని, మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌, నిర్మాణంలో సమస్యల్లేవని నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ రజిత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. బ్యారేజీ డిజైన్‌లో లోపాలుంటే ఎప్పుడో కొట్టుకుపోయేదన్నారు. గతంలో ఫరక్కా, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ, సమస్యలు వచ్చాయని గుర్తుచేశారు. మోనోలిథిక్‌ డిజైన్‌తో బ్యారేజీ నిర్మించారని, గతేడాది భారీ వరదలను కూడా బ్యారేజీ తట్టుకుందన్నారు. బ్యారేజీ మొత్తం ఎనిమిది బ్లాకులతో నిర్మిస్తే అందులో 7వ బ్లాకులోని పియర్‌ నంబర్‌ 16, 17, 18, 19, 20, 21లలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు.
తొలుత కాఫర్‌ డ్యామ్‌ నిర్మించి ఎగువ ప్రాంతాల నుంచి వరదను మళ్లిస్తామని, ఆ తరువాత చుట్టూ రింగ్‌ మెయిన్‌ నిర్మించి పియర్ల కుంగుబాటుకు గల కారణాలను గుర్తిం చాకే మరమ్మతులు ప్రారంభి స్తామని ఆయన వివరించారు. బ్యారేజీ నిర్మాణం రివర్‌ బెడ్‌పై జరగడం, ఇసుకపైనే పునాదులు ఉండటం వల్ల సమస్యలు వస్తాయన్నారు. పిలర్ల కింద ఇసుక కదలడం వల్లే కుంగినట్లు చెప్పారు. మరమ్మ తులకు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ అనుమతిం చాలని తెలిపారు. జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ కోరిన వివరాలను సమర్పించినట్లు చెప్పారు.

Spread the love