నవతెలంగాణ – రెంజల్
కేంద్ర ప్రభుత్వం రైతులపై పోలీస్ కాల్పులను వెంటనే ఆపాలని, స్వామినాథన్ కమిషన్ అమలు చేయాలని, రైతు సమగ్ర చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నసీర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులపై దమన కాండను వెంటనే నిలిపివేయాలని, రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను వెంటనే తొలగించాలని, డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధ పోశెట్టి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.