హైదరాబాద్ : వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుపిఒ) గ్లోబల్ అంబాసిడర్‌గా నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్యాకేజింగ్ అండ్ ఫార్మా రంగ దిగ్గజం చక్రవర్తి ఎవిపిఎస్ మరోమారు నియామకం అయ్యారు. ఈ విషయాన్ని డబ్ల్యుపిఒ తొలి మహిళా ప్రెసిడెంట్ బ్రెజిల్‌కు చెందిన లూసియానా పెల్లెగ్రినో ప్రకటించారు. చక్రవర్తి ఎన్నో ఏళ్లుగా ప్యాకేజింగ్ అండ్ ఫార్మా రంగాల్లో విశేష సేవలను అందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఇండో డచ్ జాయింట్ వెంచర్ అయిన ఎకోబ్లిస్ ఇండియాకు ఎండి, సిఇఒగా ఉన్నారు.